స్పీకర్‌ ఎన్నిక..చంద్రబాబుకు సీఎం జగన్‌ చురకలు

395
jagan
- Advertisement -

ఏపీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేని లాంటి వ్యక్తి స్పీకర్‌గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన జగన్‌…ఆయనకు అభినందనలు తెలిపారు.

సేమ్ టైమ్ గత శాసనసభలో జరిగిన అన్యాయాలు తిరిగి జరగకుండా కొత్త స్పీకర్ సక్రమంగా సభను నిర్వహించాలని జగన్ కోరారు. దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడని..అందుకు నిదర్శనం ఎన్నికల ఫలితాలే అన్నారు. గత ప్రభుత్వం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను అన్యాయంగా చేర్చుకుంది. ఇంతటి అన్యాయానికి పాల్పడిన టీడీపీకి దేవుడు తగిన బుద్ధి చెప్పాడన్నారు.

టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలున్నారు. ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. ఆ పార్టీలో నుంచి ఎవరినైనా తీసుకుంటే వారిని కచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటామని చెప్పారు జగన్. ఇదే శాసన సభలో విలువల్లేని రాజకీయాలు చూశామని చెప్పిన జగన్‌ ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని రాజకీయాలు చేశామన్నారు. తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదన్నారు.

- Advertisement -