ఏపీ మండలి రద్దుకు ముహూర్తం ఫిక్స్…!

197
jagan

ఏపీ శాసన మండలి రద్దుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కీలక బిల్లుల అమోదానికి మండలిలో వైసీపీ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారిన నేపథ్యంలో మండలి రద్దు వైపే జగన్ సర్కార్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

సోమవారం జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రులు, మేధావులు తగిన సమాచారం ఇవ్వాలని, వారి అభిప్రాయాలను బట్టి మండలిపై ఫైనల్ డిసిషన్ తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు.

ఒకవేళ మండలిని రద్దు చేస్తే వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే విషయాలను కూడా చర్చలు జరుపుతున్నారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉన్నాయి. మండలి కోసం రోజుకు కోటి రూపాయల ఖర్చు అవుతుందని, ఆంధ్రప్రదేశ్ లాంటి పేద రాష్ట్రానికి ఇప్పుడు మండలి అవసరమా అని జగన్..మంత్రులతో చర్చించినట్లు సమాచారం. ఒకవేళ రద్దు చేస్తే ఏ రూల్ ప్రకారం రద్దు చెయ్యొచ్చు… ఎలా రద్దు చేస్తారు అనే విషయాల కోసం ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. మొత్తంగా సోమవారం మండలి రద్దుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.