అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన సీఎం జగన్, చంద్రబాబు

111
Jagan Chandrababu

నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈసందర్బంగా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణం చేయించనున్నారు . మొదటగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణం చేయగా , ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణం చేశారు.

వీరిద్దరి తర్వాత మంత్రులు అంజాద్ బాషా, మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత తదితరులు కూడా ప్రమాణం చేశారు. ఈనెల 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో సభకు సెలవు ఉంటుంది. ఇక 17, 18వ తేదీన సమావేశాలు యధావిధిగా జరుగుతాయి. 18వ తేదీలో ఈ సమావేశాలు ముగియనున్నాయి. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.