బుమ్రాతో ఎఫైర్‌…అంతా బూమ్‌:అనుపమ

263
anupama bumra

ప్రేమమ్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. తర్వాత అఅ,శతమానం భవతి,తేజ్ ఐ లవ్‌ యు వంటి చిత్రాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుపమపై కొంతకాలంగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

టీమిండియా పేస్ బౌలర్‌ బుమ్రాతో ఈ మలార్ బ్యూటీ ప్రేమలో ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమను బుమ్రా ఫాలో అవడం..ఒకరి పోస్టులను మరొకరు షేర్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వెలువడ్డాయి.

దీంతో ఈ రూమర్స్‌పై స్పందించిన అనుపమ…ఆ వార్తలను కొట్టిపారేశారు. బుమ్రా ఓ క్రికెటర్‌గానే తనకు తెలుసు తప్ప…అతని గురించి ఇంకేమీ తెలియదన్నారు. జస్ట్ ఫ్రెండ్‌గా సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం…అతనితో లవ్,డేటింగ్ రూమర్స్ అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు…ఆలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలియదని మండిపడింది.

అయితే బూమ్రా హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపిస్తున్నాడంటూ రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాదు.. గతంలో రాశి ఖన్నాతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అవన్నీ పుకార్లేనని తెలిపోగా తాజాగా అనుపమ సైతం తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేలా సమాధానం ఇచ్చింది.