అన్నారం బ్యారేజ్‌కు జలకళ…

986
annaram barage
- Advertisement -

తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది.

రివర్స్ పంపింగ్‌తో అన్నారం బ్యారేజ్‌ జలకళ సంతరించుకుంది. గ్రావిటీ కెనాల్ ద్వారా దాదాపు 2 టీఎంసీల వరదనీరు అన్నారం బ్యారేజ్‌కు చేరుకున్నాయి. ఇక మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది 3.68 మీటర్ల ఎత్తులో 25 వేల క్యూసెక్కుల నీళ్ల ప్రవాహము తో ప్రవహిస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 96 మీటర్ల నీళ్లు ఉన్నాయి.ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నాయి.

నది సహజస్వభావానికి భిన్నంగా నీటిప్రవాహం పల్లం నుంచి ఎదురెక్కుతుండటంతో ఎగువ ప్రాంత తీర గ్రామాల చెంతకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాధారణంగా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి రావాల్సిన గోదారమ్మ.. ఎదురుప్రవాహంతో వస్తున్న దృశ్యం సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

- Advertisement -