రామ్ చరణ్ తో అనిల్ రావిపూడి!

562
Ram Charan Anil Ravipudi
- Advertisement -

యువ దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీమ్, రాజాది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి.. వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజలతో ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో పాటు మహేశ్ బాబుతో మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.

ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి ఇటివలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కలిసి కథ వినిపించాడట. కథ నచ్చడంతో వెంటనే పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాడట చెర్రీ. ఇక రామ్ చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ జులైలో విడుదల కానుంది. ఈమూవీ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కమిట్ మెంట్ ఇవ్వలేదు. కాగా రామ్ చరణ్ కోసం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, తమిళ దర్శకులు అట్లీ లు రెడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత మంది దర్శకులలో రామ్ చరణ్ ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి మరి.

- Advertisement -