బర్త్ డే చిట్‌చాట్..పెళ్లి కోసం లోన్‌ తీసుకున్నా..

128
anasuya

సినిమా రంగుల ప్రపంచం… ఇందులో రాణిచడం అంటే చిన్న విషయం కాదంటోంది యాంకర్ అనసూయ. మే 15 తన బర్డ్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనసూయ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినిమా రంగంలో ఎన్నో కష్టాలుంటాయి.. కాంప్రమైజ్‌లు ఉంటాయి. వాటన్నింటిని ఇక్వల్‌గా తీసుకుని ముందుకుసాగితే విజయం సాధించగలుగుతామని అందుకే తాను ఈ స్టేజ్‌లో ఉండగలిగానని తెలిపింది.

తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం అమ్మ చెప్పిన మాటలే అని తెలిపింది. దేవుడి దయవల్ల మంచి భర్త దొరికాడని..మా పెళ్లి లోన్ తీసుకునే చేసుకున్నామని తెలిపింది. మేం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఇంట్లో నుండి ఒక్క పైసా కూడా తీసుకోకుడదని డిసైడ్ అయ్యామని చెప్పుకొచ్చింది.

మా నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కావడంతో మాతో ఉండటం చాలా తక్కువ. ఉన్నంత వరకూ చాలా బాగా అనిపించిందన్నారు. మా అమ్మే మమ్మల్ని కష్టపడి పెంచింది అన్ని తానై చూసుకుందని వెల్లడించింది. అమ్మ తనకు జన్మనివ్వడమే పెద్ద గిఫ్ట్. ఇండస్ట్రీలో ఇక్కడి వరకూ నెట్టుకుని వచ్చాను అంటే వాళ్లు పెంచిన పెంపకమే కారణమని స్పష్టం చేసింది.

బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై రంగమ్మత్తగా వెలుగువెలుగుతోంది. ‘క్షణం’, ‘యాత్ర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో గ్లామరస్ నటిగా పేరు సంపాదించింది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రంగమ్మత్త అనసూయ ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,ప్రేక్షకులను ఇలాగే అలరించాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.