మొక్కలు నాటిన ఎపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

164
anil

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ముఖ్యమని దానికి రోజా గారు ఇక్కడ మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకం అన్నారు. ,పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలియజేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా గారిని , టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గారిని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. తాను మరో ముగ్గురికి ఈ గ్రీన్‌ ఛాలెంజ్ సవాల్ విసుతున్నట్లు తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావాలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, హీరో అర్జున్ లను మొక్కలు నాటాల్సిందిగా కోరారు.