ఏపీలో ‘పాదయాత్ర’ చేస్తేనే ‘పవర్’…

353
Jagan Kcr Chandrababu
- Advertisement -

దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు దశాబ్దాలుగా ఏపీలో ఓ ప్రత్యేకమైన ట్రెండ్ నడుస్తోంది. పాదయాత్ర చేసినవాళ్లదే అధికారం అని మరోసారి రుజువైంది. తొలిసారిగా 2004 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టారు ప్రజలు. అప్పటికే పదేళ్లకు పైగా పాలించిన చంద్రబాబు పైన ఉన్న వ్యతిరేకత కూడా చంద్రబాబుకు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి.

వైఎస్ విజయంలో పాదయాత్ర ముఖ్యమైన ఘట్టం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన మరోసారి విజయం సాధించారు. ఇక తర్వాత 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీ, జనసేన తో పొత్తు వల్ల అధికారంలోకి వచ్చారు. ఇక వైయస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర రికార్డుగా చెప్పకోవచ్చు.. 3500కి.మి పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు.

పాదయాత్రలో కోట్లాది మంది ప్రజలను కలవడం ఆయనకు ప్లస్ గా మారింది. ఇక ఈసారి జరిగిన ఎన్నికల్లో జగన్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఇక పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది. ఈపాదయాత్ర సెంటిమెంట్ మరెంత మంది నాయకులను ముఖ్యమంత్రులుగా చేస్తుందో చూడాలి.

- Advertisement -