నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ముందు జగన్, ఆతర్వాత చంద్రబాబు

140
Ap Assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు తొలి సమావేశం ప్రారంభం అవుతుంది. సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది.

అనంతరం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది.గవర్నర్ నరసింహన్ శుక్రావారం సభను ఉద్దేశించి ప్రసగించనున్నారు. 15, 16 తేదీల్లో సభకు విరామం కాగా, 17,18 తేదీల్లో తిరిగి సమావేశాలు కొనసాగనున్నాయి. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.