ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీ ప్రభంజనం..

281
YS Jagan Mohan Reddy
- Advertisement -

లోకసభ,శాసనసభ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని, టీడీపి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అత్యధిక సర్వే సంస్థలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం పదవి వరించనున్నట్లు చెబుతున్నాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌లో భాగంగా ఇండియాటుడే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 130–135 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 37–40 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. జనసేనకు ఒక్క సీటు లేదంటే అది కూడా రాకపోవచ్చని విశ్లేషించింది. ఇక ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి 18–20, టీడీపీకి 4–6 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు ఒక స్థానం దక్కే అవకాశం కూడా ఉందని తెలిపింది.

Andhra Pradesh Exit Poll Results

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 98 అసెంబ్లీ సీట్లు లభించగా టీడీపీకి 65 సీట్లు రావచ్చని తెలిపింది. జనసేనకు 2 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వైఎస్సార్‌ సీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.

వీడీపీ అసోసియేట్స్‌ వైఎస్సార్‌సీపీకి 111–121 స్థానాలు, టీడీపీకి 54–60 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో తెలిపింది. ఇతరులు 4 చోట్ల గెలుపొందవచ్చు.. వైఎస్సార్‌సీపీ – టీడీపీ మధ్య ఓట్లలో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి.

Andhra Pradesh Exit Polls

 

- Advertisement -