బిగ్ బాస్ హౌస్‌లో సుమ.. ఫ‌న్నీ టాస్క్‌లు..

917
suma kanakala
- Advertisement -

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురు ఫైనలిస్టులు దీపావళి జరుపుకున్నారు. దీపావళి రోజు వాళ్లతో ప్రముఖ యాంకర్ సుమ జాయిన్ అయ్యారు. సుమ ఎంట్రీతో హౌస్‌మేట్స్ శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ, వరుణ్, రాహుల్ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతా ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తరవాత సుమ హౌస్‌లో బాగానే హంగామా చేశారు. ప్రేక్షకుల్లో ఒకరిగా తాను హౌస్‌లోకి అడుగుపెట్టానని, తానే స్వయంగా తిరిగి అన్నీ తెలుసుకుంటానని ముందుగానే అందరికీ సుమ చెప్పేశారు.

బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ ఏరియా అన్నింటిపై ఓ లుక్కేసింది. దీపావ‌ళి విశేషాల‌ గురించి అడిగింది. సుమ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా మ‌ట‌న్ బిర్యానీకి సంబంధించిన ఐటెమ్స్ పంపారు. వాటిని వండి అంద‌రు ఆర‌గించారు.ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో కలిసి ఫ‌న్నీ టాస్క్ ఆడింది సుమ‌.

anchor suma

ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఒకరి తరవాత ఒకరు హెడ్‌ఫోన్స్‌ను ధరించాలి. ఆ హెడ్‌ఫోన్స్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ సమయంలో సుమ కార్డ్స్‌లోని వాక్యాలను చదివి వినిపిస్తారు. హెడ్‌ఫోన్స్ ధరించిన సభ్యుడు సుమ చెప్పిన వాక్యాన్ని కరెక్ట్‌గా చెప్పాలి. ఈ టాస్క్‌లో గెలిచిన వారు బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తారు. ఈ బెస్ట్ ఎంటర్‌టైనర్‌ను సుమ నిర్ణయిస్తారు. ఈ టాస్క్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచినవారు తమ ఫ్యాన్ నుండి ఫోన్ కాల్ మాట్లాడే అవకాశాన్ని గెలుచుకుంటారని బిగ్ బాస్ వెల్లడించారు.

ముందుగా టాస్క్‌లో శ్రీముఖి పాల్గొన‌గా, సుమ చెప్పిన‌వ‌న్నీ క‌రెక్ట్‌గా గెస్ చేసింది. మిగ‌తా వారు ఒక‌టి రెండు మాత్ర‌మే చెప్ప‌గ‌లిగారు. అయితే ‘‘బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు’’ అని సుమ చదివితే.. దానికి వరుణ్ ‘‘పుచ్చకాయ పచ్చిగా ఉంది, పుచ్చకాయ పెద్దగా ఉంది’’ అని అందరినీ తెగ నవ్వించాడు. దీంతో అత‌నిని బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సెల‌క్ట్ చేసింది సుమ‌. ఇక నేటి ఎపిసోడ్‌లోను సుమ సంద‌డి కొన‌సాగ‌నుండ‌గా, ఇంటి సభ్యులతో కలిసి ఆమె సరదాగా టపాసులు కూడా కాల్చనున్నారు.

కాగా, ‘బిగ్ బాస్’ టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్లు పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్‌లలో ఒకరు టైటిల్‌ను ఎగరేసుకుపోనున్నారు. అంతేకాదు, విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీని అందించనున్నారు.

- Advertisement -