నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన.. రష్మి

57

ఇటీవల ఓ మేగజైన్ కోసం ఫొటో షూట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, రవిక ధరించకుండా పోజులివ్వగా, కొందరు మండిపడ్డారు. మరికొందరు ఇండియాలో రవిక లేకుండా చీర ధరించే మహిళలు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ప్రియాంక కవర్ పేజ్ వైరల్ కావడంతో, దీనిపై ఎంతో చర్చ జరుగుతోంది.

పూర్వకాలం నుంచి రవిక లేని చీరలు కట్టుకునే సంప్రదాయం ఇండియాలో ఉందంటూ, ఓ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని కూడా రాసింది. అంతవరకూ బాగానే ఉంది. ఈ కథనాన్ని యాంకర్ రష్మి రీ ట్వీట్ చేస్తూ, తన అభిమానులతో పంచుకుంది.

Anchor Rashmi

దీన్ని ఓ నెటిజన్‌ విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఇలాంటివి ధరించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.. ఇలాంటి వాటి వల్లే అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరిస్తూ అత్యాచారాలకు గురి అవుతున్నారు. సరైన పొడవు దుస్తులు ధరిస్తే దాదాపు నేరాల్ని తగ్గించొచ్చు. దీని గురించి కాస్త ఆలోచించండి’ అంటూ రష్మి గౌతమ్‌ను ట్యాగ్‌చేశారు.

ఇక ఇది చూసి ఆగ్రహించిన రష్మీ, ఘాటైన రిప్లై ఇచ్చింది.. ‘ఇలాంటి ఆలోచనలు ఉన్న నువ్వు జన్మించడమే ఓ పెద్ద నేరం’ అని అన్నారు. దీనికి సదరు నెటిజన్‌ తన ట్వీట్‌ను డిలీట్‌ చేసేశారు. ‘మీకు నేను వ్యతిరేకం కాదు రష్మి గారు.. నేను నిజం చెబుతున్నా. కొన్ని సందర్భాల్లో నేరాలు ఇలా కూడా జరుగుతుంటాయి. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి’ అని పేర్కొన్నారు.