టీవీలో రంగ‌స్ధ‌లం సినిమా చూసిన రంగ‌మ్మ‌త్త‌..

314
anchor anasuya watching rangastalam movie in television
- Advertisement -

గ‌త నెల‌లో విడుద‌లై భారీ హిట్ ను సొంతం చేసుకుంది రంగస్ధ‌లం సినిమా. రామ్ చ‌రణ్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది రంగ‌స్ధ‌లం సినిమా. బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఇక ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు అత్త‌గా యాంక‌ర్ అన‌సూయ న‌టించిన వ‌ష‌యం మ‌నందరికి తెలిసిందే. రంగ‌మ్మత్త పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. త‌న అందం, త‌న న‌ట‌న‌తో అన‌సూయ‌కు మంచి పేరు వ‌చ్చింది. ఇక ఈ చిత్రాన్ని యాంక‌ర్ అన‌సూయ ఇటివ‌లే త‌న ఇంట్లో టీవిలో విక్షించింది.

anchor anasuya watching rangastalam movie in television
ఆ విష‌యాన్ని స్వ‌యంగా మన రంగ‌మ్మ‌త్తే త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. అదేంటి రంగ‌స్ధ‌లం సినిమా టీవిల్లో వ‌చ్చిందనుకుంటే పొర‌పాటే. అమెజాన్ ప్రైమ్ విడియోస్ లో రంగ‌స్ధ‌లం సినిమాను విక్షించింది యాంక‌ర్ అన‌సూయ‌. ఈ సినిమా విడుద‌లై నేటికి న‌ల‌భై రోజులు పూర్త‌యింది. ఈసినిమా ప్రోడ్యూస‌ర్ల‌తో అమెజాన్ యాజ‌మాన్యం ముందుగానే ఇ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక రంగ‌స్ద‌లం సినిమా థియేట‌ర్ల‌లో భారీ విజ‌యాన్ని అందుకున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో సినిమాను పెట్ట‌గానే ఇప్ప‌టికే చాలా మంది విక్షించారు. రంగ‌స్ధ‌లం సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎంత పెద్ద రికార్డును సొంతం చేసుకుంటుందో చాడాలి.

- Advertisement -