నా పిల్లల్ని “అర్జున్ రెడ్డి” లా పెంచుతాః అనసూయ

215
Anasuya Family

బుల్లితెరపై యాంకర్ గా చేస్తూ అప్పుడప్పుడు వెండితెరపై కూడా నటిస్తోంది అనసూయ. బుల్లితెరపై సక్సెస్ కొట్టిన ఈభామ వెండితెరపై కూడా దూసుకుపోతుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. రంగస్ధలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ..తాజాగా కథనం సినిమాలో కీలక పాత్రలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అనసూయకు అదే రేంజ్ లో నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతుంటారు. వల్గర్ గా కామెంట్లు పెట్టె వారికి అదే రేంజ్ లో సమాధానం ఇస్తుంది అనసూయ.

కధనం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ టీవికి ఇంటర్వూ ఇచ్చింది. మీ డ్రెస్ విషయంలో చాలా మంది కామెంట్లు చేస్తుంటారు అని అడగ్గా.. నేను ఇద్దరి పిల్లలకు తల్లిని కావడం, పైగా తెలుగు అమ్మాయిని కావడం వల్ల నా డ్రెస్ పై అలా కామెంట్లు చేస్తుంటారని సమాధానం ఇచ్చింది.

నేను తెలుగు అమ్మాయిని కాబట్టి అలా ట్రోల్ చేస్తున్నారు..అదే వేరే అమ్మాయిలను ఇలా అడుగుతారా అని ప్రశ్నించారు. అయితే ఈ ట్రోలింగ్ తనను కాకుండా తన పిల్లలను కూడా ఇన్వాల్ చేస్తున్నారని మండిపడింది. నా పిల్లలు నాఇష్టం..ఇంకా చెప్పాలంటే వాళ్లను అర్జున్ రెడ్డి స్టైల్ లో పెంచుతానని చెప్పింది. అనసూయ సమాధానంపై నెటిజన్స్ ఏవిధంగా కామెంట్లు చేస్తారో చూడాలి.