రంగమార్తాండలో రంగమ్మత్త రోల్ ఇదేనా ?

321
anasuya
- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది.రంగస్థలం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ…కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకుసాగుతోంది.

తాజాగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తోంది. ఇటీవలె అనసూయకు సంబంధించిన లుక్‌‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నీలం రంగు చీరలో పూల మధ్యలో అనసూయ మెరిసిపోయింది.

ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికి వస్తే.. నాటకాలు వేసే ఓ రంగస్థలం నటిగా నటించనుందట. ఈ సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేక సాంగ్ లో అనసూయ నటించనుందట.

మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రంగమార్తాండను తెరకెక్కిస్తున్నారు.ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.

- Advertisement -