లక్‌ అంటే ఇదే..గూగుల్‌ పేలో లక్ష రూపాయలు!

202
google pay

అదృష్టం అంటే ఇదే..మూడు వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేస్తే లక్ష రూపాయల జాక్ పాట్ తగిలింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ తన స్నేహితుడికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏకంగా లక్ష రూపాయల మనీ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఊహించని విధంగా మనీ రావడంతో సూర్యప్రకాశ్‌ సంతోషం వ్యక్తం చేశాడు.ఎన్నో సార్లు మనీ ట్రాన్స్ఫర్ చేసినా..ఇంత మొత్తంలో ఎప్పుడూ రాలేదని చెప్పాడు.ఇప్పడు ఏకంగా లక్ష రూపాయలు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

ఏడాదిగా గూగుల్ పే వాడుతున్నా. ఇప్పటివరకు రివార్డ్ రూపంలో 107 రూపాయలు వచ్చింది. నా స్నేహితుడు రూ.3వేలు అడిగాడు. అతడికి గూగుల్ పే ద్వారా పంపాను. ఆ వెంటనే నాకు రివార్డ్ రూపంలో లక్ష రూపాయలు వచ్చింది. అది చూసి షాక్ అయ్యానని తెలిపాడు.