కంగ్రాట్స్ బావా..బొమ్మ అదిరిందిః ఎన్టీఆర్

962
Allu Arjun ntr Ala Vaikuntapuram;lo
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈమూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటీవ్‌ టాక్‌ వచ్చింది.చాలా గ్యాప్‌ తర్వాత వచ్చిన తమ హీరో సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో బన్నీ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. తాజాగా ఈసినిమాపై స్పందించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నటన అద్భుతంగా ఉందంటూ ట్విట్‌ చేశారు. ‘అల… వైకుంఠపురములో చిత్రం అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాటలు రాశారు… కంగ్రాట్స్ బావా అండ్‌ స్వామీ” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సినిమా మొత్తంలో మురళిశర్మ నటన అద్భుతం అన్నారు. ఈసినిమాలో సంగీతం చాలా బాగుందన్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందన్నారు. అల..వైకుంఠపురంలో చిత్రయూనిట్ కు అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్ధకు అభినందనలు తెలిజయేశారు.

- Advertisement -