అమీకి అదనంగా కోటి కావాలట..

192
Amy Jackson Hot Photoshoot
- Advertisement -

అమీ జాక్సన్ అంటే తెలియని యూత్ ఇప్పుడు లేరంటే పెద్దగా మనం ఆశ్చర్యపడే పనిలేదు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఆమె ఫోటో షూట్లు మాత్రం లెక్కపెట్టలేనన్ని చేసింది. చేసిన ఫోటో షూట్లు మళ్ళీ మామూలుగా ఉంటాయి అనుకుంటే మీరు పొరపడినట్లే. ఆమె బికినీ ఫోటో షూట్లు బీచ్ లో విహారాలు కొత్త కొత్త ఫ్యాషన్ వస్త్రాల్లో తన సోయగాలును చూపిస్తూ ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు వేడిని పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఒక హాట్ ఫోటో షూట్ తో కాకపోయినా ఆమె అడిగిన పారితోషకంతో హాట్ న్యూస్ గా మారింది.

Amy Jackson Hot Photoshoot

అమీ జాక్సన్ ను తమ ప్రోడక్ట్స్ కి ప్రచారకర్తగా తీసుకోవాలని ఒక కార్పొరేట్ సంస్థ ముందుకు వచ్చింది. ఆమెతో 3 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాళ్లు ఆమెతో ఓ 6 గంటల పాటు ఫోటో షూట్ చేయించాలనుకున్నారు. అయితే ఫోటో షూట్ కి అదనంగా అమీ జాక్సన్ కోటి రూపాయలు అడిగిందట. అంతే ఆ సంస్థ నిర్వాహకులు కోలుకోవడానికి కొంత సమయం పట్టిందట.

ఈ సుందరి నటించిన సినిమాల సంఖ్యను వేళ్లపై లెక్కబెట్టొచ్చు. కాకపోతే శంకర్ కాంబినేషన్‌లో విక్రమ్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చేయడం వలన స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం బూగీ మాన్ అనే ఇంగ్లిష్ సినిమాలో నటిస్తున్న ఆమీ.. దానితో పాటు మన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 సినిమా కూడా చేస్తోంది. సినిమాలు పెద్దగా చేతిలో లేని కారణంగా ఈ విదంగా రేట్ ఒక్కసారిగా పెంచేసింది అని చెబుతున్నారు కొంతమంది యాడ్ ఏజన్సీ వాళ్ళు.

- Advertisement -