అమృతరామమ్‌.. ఫస్ట్ లుక్

444
tollywood
- Advertisement -

రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్‌ జంటగా సురేందర్ కొంటాడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా “అమృత రామమ్”. ‘‘దేర్‌ ఈజ్‌ నో లవ్‌ విత్ ఔట్‌ పెయిన్‌’’అనేది ట్యాగ్ లైన్. యస్.ఎన్ రెడ్డి నిర్మాత. ఒక గాఢమైన ప్రేమకథగా ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత మధురా శ్రీధర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ కొంటాడ్డి మాట్లాడుతూ.. “ప్రేమలోని గాఢతను ఈ కథతో చెప్పబోతున్నాం. ఈ ప్రేమకథలో పాటలు హైలెట్‌గా నిలవబోతున్నాయి. ఎన్.ఎస్ ప్రసు అందించిన స్వరాలు ఈ కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఈ మధ్య లవ్ అనేది ఆప్షన్‌గా చాలా మంది చూస్తున్నారు. కానీ, ఈ ప్రేమకథలో ఆప్షన్స్ కనపడవు.హీరోయిన్ అమిత, హీరో రామ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.

పద్మజా ఫిలింస్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సినిమావాలా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లో..నటీ నటులు:హీరో: రామ్ మిట్టకంటి,హీరోయిన్: అమిత రంగనాథ్‌,శ్రీజిత్ గంగాధర్,ఎమిలి మార్టిన్,సారా జోన్స్,శుక్రుతి నారాయణ్,చెరుకూరి జగదీశ్వర్‌రావ్,వంశీ దావులూరి,సాంకేతిక నిపుణులు:మ్యూజిక్ డైరెక్టర్: ఎన్.ఎస్ ప్రసు,పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే,పిఆర్వో : జి.ఎస్.కె మీడియా,ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,సినిమాటోగ్రఫీ: సంతోష్ శానమోని,నిర్మాత: యస్.ఎన్ రెడ్డి,రచన-దర్శకత్వం: సురేందర్ కొంటాడ్డి

- Advertisement -