పోస్ట్ ప్రొడక్షన్‌లో `అమ్మాయి ప్రేమలో పడితే`

90
Ammay Premalo Padithy

ఎ.ఎస్.ఎం.ఆర్ సమర్పణలో అరిగెల ప్రొడక్షన్స్‌ బేనర్‌పై మణీందర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం `అమ్మాయి ప్రేమలోపడితే`. సోనాక్షి వర్మ హీరోయిన్‌. హర్షవర్ధ‌న్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా…హీరో దర్శకుడు మణీందర్‌ మాట్లాడుతూ “స్వచ్చమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అందుకు మన చాలా ఉదాహరణలున్నాయి. అలాంటి ఓ సచ్ఛమైన ప్రేమకథగా మా చిత్రం `అమ్మాయి ప్రేమలో పడితే` తెరకెక్కుతోంది. మంచి లవ్ అండ్ ఎమోషన్ ఎలిమెంట్స్ రూపొందుతోన్న మా చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం“ అన్నారు.