“అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి” సీక్వెల్ లో విజయ్

223
vijay-devaraakonda-puri

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తన తర్వాతి సినిమా పక్కా మాస్ యాంగిల్ లో ఉండాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఛార్మీ నిర్మాతగా వ్యవహరించనున్న ఈసినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. ఈసినిమాలో విజయ్ దేవరకొండ బాక్సార్ గా కనిపించడనున్నాడని తెలుస్తుంది.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పూరి తెరకెక్కించనున్న ఈ సినిమా ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాకి సీక్వెల్ అని అంటున్నారు ఫిలింనగర్ వర్గాలు. విజయ్ కోసం పూరీ రాసుకున్న కథ ఆ సినిమాకు దగ్గరగా ఉంటుందని టాక్. ఈసినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. జనవరి నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

ఇక రవితేజ హీరోగా నటించిన అమ్మనాన్న ఓ తమిళమ్మాయి సినిమా భారీ విజయాన్ని సాధించింది. 2003లో విడుదలైన ఈసినిమా రవితేజ కెరీర్ లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా పూర్తైన తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.