అజ్ఞాతం వీడిన కల్కి దంపతులు

349
kalki bhagavan

ఐటీ దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కల్కి భగవాన్‌ ఎట్టకేలకు స్పందించారు. తాము దేశం విడిచి వెళ్లిపోయామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తాము చెన్నెలోని ఏకం ఆశ్రమంలోనే ఉన్నామంటూ ఓ వీడియోని రిలీజ్‌ చేశారు. తమ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని భక్తులకు తెలియజేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లోని కల్కి ఆశ్రమాలు, నివాసాలు, వ్యాపార సంస్థలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారుల దాడులు చేయగా రూ.93 కోట్ల మేర సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. వీటితో పాటు రూ.409 కోట్ల మేర అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

ఎల్‌ఐసీ గుమాస్తాగా ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్కి అలియాస్ విజయ్ కుమార్ 1980ల్లో వన్నెస్ పేరుతో ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఆటలు ఇలా అనేక రంగాలకు విస్తరించారు. దక్షిణాదిలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆయనపై హవాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరిగాయి.