ఓఎల్‌ఎక్స్‌లో అమితాబ్ బెంజ్‌ కారు..ఎంతో తెలుసా.!

124
olx amithab car

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కారును అమ్మకానికి పెట్టారు. ప్రముఖ ఆన్‌ లైన్ మార్కెట్ కంపెనీ ఓఎల్‌ఎక్స్‌లో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ కారు రూ.9.99 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్‌ఎక్స్‌ సంస్థ వెల్లడించింది. ఈ కారును తొలుత అమితాబ్ తర్వాత ఆయన నుంచి కొనుగోలు చేసిన మరో వ్యక్తి వాడారని ఓఎల్‌ఎక్స్ తెలిపింది. ఇద్దరు ఓనర్లు ఛేంజ్ కావడంతో రూ.9.99 లక్షలకే అమ్మకానికి పెట్టారని వెల్లడించింది.

మార్కెట్‌లో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ కొత్త కారు ధర రూ.1.36 కోట్లు. కానీ, ఈ కారు రూ.9.99 లక్షలకే లభ్యమవుతుండడం, అందులోనూ ఒకప్పుడు అమితాబ్‌ వాడిన కారు కావడంతో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారట.

గతంలోనూ అమితాబ్‌ తనకు ఓ దర్శకుడు కానుకగా ఇచ్చిన రూ.3.5 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారును అమ్మేశారు. అమితాబ్‌ గ్యారేజ్‌లోకి ఏదన్నా కొత్త మోడల్‌ కారు చేరితే.. చాలా కాలంగా వాడుతున్న పాత కారును అమ్మేస్తారని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.