అంగోత్ తుకారాంకు కేటిఆర్ అభినందనలు..

117
KTR

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అంగోత్ తుకారాం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని నేడు (జూన్ 14, 2018) కలవాడం జరిగింది. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినందుకు అంగోత్ తుకారాంకు కేటిఆర్ శుభాభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కాసేపు కేటీఆర్ తుకారాంతో ముచ్చటించారు. పర్వతారోహణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంగోత్ తుకారాం సాధించిన ఈ విజయం పట్ల కేటీఆర్ అతడిని ప్రశంసించారు. ఇంతటి విజయాన్ని సాధించిన యువ పర్వతాధిరోహకుడికి భవిష్యత్తులో అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కేటీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారు.

అంగోత్ తుకారాం అత్యంత ఎత్తయిన 8,848 మీటర్ల ఎవరెస్టు శిఖరాన్ని 22 మే 2019 వ తేదీన అధిరోహించాడు. నేపాల్ లోని అత్యంత క్లిష్టమైన సౌత్ కోల్ మార్గం గుండా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన దక్షిణ భారత అతి చిన్న వయస్సు గల పర్వతారోహకుడిగా రికార్డు సృష్టించాడు.

అంతకుముందు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి 2018లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. 17 ఏళ్ల వయసు నుండే పర్వతారోహణ పట్ల తన యొక్క ఆసక్తిని పెంచుకున్న తుకారాం.. కొంతమంది అధికారుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించగలిగాడు.