అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన వివరాలు

196
namaste-trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులు భారత్ లో పర్యటించనున్నారు. ఆయన సతీమణి మెలానియాతో కలిసి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ప్రత్యేక విమానంలో ఇండియాకు బయల్దేరారు. ఈరోజు ఉదయం 11.40గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకోనున్నారు ట్రంప్ బృదం. ఇక ట్రంప్ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ట్రంప్ కు ఇచ్చే విందులో పాల్గోనేందుకు అతికొద్ది మందికే అహ్వానం అందింది. ఈ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో పర్యటించనున్నారు . ట్రంప్ పర్యటన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఉదయం 11.40గంటలకు అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ట్రంప్. ఆ తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 1.05 గంటలకు మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు.

నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ఆగ్రాకు బయల్దేరనున్నారు. సాయంత్రం 5.15గంటలకు ఆగ్రాకు ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. సాయంత్రం 6.45గంటలకు ఆగ్రానుంచి తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఉదయం 9.55గంటలకు రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు. రేపు ఉదయం 10.45గంటలకు రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధికి ట్రంప్ నివాళి అర్పించనున్నారు. రేపు ఉదయం 11.25గంటలకు హైదరాబాద్ హౌస్ కు వెళ్లనున్నారు. అనంతరం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ ను సందర్శించనున్నారు ట్రంప్ దంపతులు. రేపు మధ్యాహ్నం 2.55గంటలకు యూఎస్ ఎంబసికి చేరుకోనున్నారు ట్రంప్. రేపు సాయంత్రం 4గంటలకు యూస్ ఎంబసి సిబ్బందితో ట్రంప్ సమావేశంకానున్నారు. రేపు సాయంత్రం 5గంటలకు హోటల్ మౌర్యాకు చేరుకోనున్నారు ట్రంప్. రేపు రాత్రి 7.25గంటలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు ట్రంప్. రేపు రాత్రి 8గంటలకు ట్రంప్ దంపతలుకు విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి. అనంతరం రాత్రి 10గంటలకు తిరిగి అమెరికాకు పయనం కానున్నారు ట్రంప్ దంపతులు.