అంబటి రాయుడుకు గోల్డెన్ ఛాన్స్ ..

50
ambati rayudu

టీంఇండియా ఆల్ రౌండర్ అంబటి రాయుడుకి ఎట్టకేలకు వరల్డ్ కప్ లో అడే అవకాశం దక్కింది. ఐపిఎల్ లో తనదైన ప్రతిభ కనబర్చిన రాయుడుకి ఇటివలే ఎమ్మెర్జెన్సీ ప్లేయర్ గా ఛాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ కు ఎంపికైన ఆల్ రౌండర్ కేదార్ జాదవ్…ఐపిఎల్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు.

జాదవ్ కు గాయం కారణంగా మిగతా మ్యాచ్ ల నుంచి అతన్ని పక్కన పెట్టేయాలని నిర్ణయించింది చెన్నై యాజమాన్యం. గాయం బలంగా తగలడంతో కేదార్ జాదవ్ వరల్డ్ కప్ కు కూడా ఆడకపోవచ్చంటున్నారు సెలక్టర్లు. దీంతో అతని స్ధానంలో అంబటి రాయుడుని తీసుకొనున్నట్లు తెలుస్తుంది. మే 30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.