మరోసారి అమెజాన్ లో భారీ డిస్కౌంట్లు..

196
amazon big discount day offer mobiles and laptops..
- Advertisement -

భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్ కార్ట్ తో పోటాపోటీగా తలపడుతున్న గ్లోబల్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లని ప్రకటించేసింది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆఫర్లను ప్రకటించిన అమెజాన్‌..మరో సారి డిస్కౌంట్లకు తెరతీసింది.

ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫ‌ర్లతో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

amazon big discount day offer mobiles and laptops..

నేటినుంచి జూన్‌ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్‌ప్లస్‌, ఆపిల్‌, శాంసంగ్‌ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్‌టాప్‌, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్‌ వెల్లడించింది.

ఐఫోన్ 7, వన్‌ప్లస్‌ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్‌ ఎస్‌ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్‌ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తిస్తుంది.

 amazon big discount day offer mobiles and laptops..

వన్‌ ప్లస్‌ 3టీపై డిస్కౌంట్‌ తోపాటు వొడాఫోన్‌ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్‌ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ , శాంసంగ్‌ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కూల్‌ ప్యాడ్‌ పై రూ. 2వేలు డిస్కౌంట్‌ అందిస్తోంది.

వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్‌ ట్యాప్‌ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్‌ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. ఇక మరిన్ని వివరాల కోసం అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ పై ఓ లుక్కెయ్యాల్సిందే.

- Advertisement -