నాగార్జునకు అమల స్పెషల్‌ విషెస్‌..!

24
Amala

కింగ్‌ నాగార్జున, అమల వివాహ దినోత్సవం నేడు. వీరు 1992, జూన్ 11న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమల తన ప్రియమైన భర్త నాగ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. చాలా ఏళ్ల క్రితం దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో అక్కినేని అమల ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘నా ప్రేమ, సర్వస్వం అయిన అక్కినేని నాగార్జునకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు వస్తున్న అభినందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నా. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని అమల ట్వీట్ చేశారు. అక్కినేని నాగార్జున, అమల 1992, జూన్ 11న వివాహం చేసుకున్నారు.

నాగార్జున స్నేహితుడు రామ్‌ ప్రసాద్‌ ‘శివ’ సినిమాలోని ‘సరసాలు చాలు..’ పాట వీడియోను షేర్‌ చేశారు. నాగ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని నాగ్‌ రీ ట్వీట్‌ చేశారు. ‘నా ప్రియమైన స్నేహితుడికి ధన్యవాదాలు. మాపై ప్రేమ కురిపించిన వారందరికీ తిరిగి నా ప్రేమను పంపుతున్నా’ అని కింగ్‌ పోస్ట్‌ చేశారు.