అవన్నీ పుకార్లే…నేను క్షేమంగానే ఉన్నా:తరుణ్

282
tarun

రోడ్డు ప్రమాదంతో తనకు గాయాలైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు హీరో తరుణ్. నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కార్డు డిడైడర్‌ని ఢీ కొట్టడం,అందులో తాను గాయపడినట్లు వస్తున్న వార్తలన్ని పుకార్లే అన్నారు.

తాను రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నానని తన కారు కూడా క్షేమంగానే ఉందన్నారు. యాక్సిడెంట్ అనంతరం తాను వేరే కారులో వెళ్లినట్లు కూడా కొన్ని చానల్స్ వార్తలు టెలికాస్ట్ చెస్తున్నాయని అవన్నీ నిజం కాదన్నాడు. ఇక ఈ యాక్సిడెంట్‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.