స్పీచ్‌తో అదరగొట్టిన అల్లు శిరీష్‌..

42
ABCD Movie

అల్లు శిరీష్‌ రుక్సర్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా… అల్లు శిరీష్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సినిమా గురించి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా మా నిర్మాత మధురశ్రీధర్‌కి థాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను. సురేష్‌బాబుకి, యష్‌కి కూడా థాంక్స్‌. నన్ను బాగా ప్రెజెంట్‌ చేసిన దర్శకుడు సంజీవ్‌కి, మంచి మ్యూజిక్‌ అందించిన జుడో సాండీకి థాంక్స్‌. అలాగే అందరికీ థాంక్స్‌” అన్నారు.

ABCD Movie

నటుడు భరత్‌ మాట్లాడుతూ – ”కొన్నిసార్లు కొన్ని ఫీలింగ్స్‌ ఇతరులు అర్థం చేసుకోలేరు. కోట్ల రూపాయల మధ్య బ్రతికే ఇద్దరు వ్యక్తులు సాధారణ జీవితాన్ని ఎలా గడిపారని చెప్పేదే ‘ఏబీసీడీ’ మూవీ. బ్రతికేటప్పుడు ఎలా బ్రతుకుతున్నారు? ఎలా కష్టపడుతున్నారు? అనే విషయాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మలయాళ రీమేక్‌ అయితే తెలుగులో చాలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను యాడ్‌ చేశారు. డైరెక్టర్‌ సంజీవ్‌, హీరో అల్లు శిరీష్‌ నెటివిటీ పరంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను యాడ్‌ చేసుకుంటూ వచ్చారు. మెల్లమెల్లగా సాంగ్‌ పెద్ద హిట్‌ అయ్యింది” అన్నారు.

హీరోయిన్‌ రుక్సర్‌ థిల్లాన్‌ మాట్లాడుతూ – ”చాలా ఫన్‌, థ్రిల్లింగ్‌, ఎగ్జయిట్‌మెంట్‌ ఉండే సినిమా ఇది. దర్శకుడు సంజీవ్‌, నిర్మాతలు యష్‌.. మధుర శ్రీధర్‌కి థాంక్స్‌. భరత్‌ మంచి కోస్టార్‌. శిరీష్‌ సెట్స్‌లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ ఎంకరేజ్‌ చేస్తూ వచ్చారు. గ్రేట్‌ కోస్టార్‌ తను. మే 17న విడుదలవుతున్న ఈ సినిమాను సక్సెస్‌ చేయాలని కోరుతున్నాను” అన్నారు.