డ్యూయల్ రోల్ లో బన్నీ ..

248
Ala-Vaikuntapuram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు అల..వైకుంఠపురంలో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈచిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. బన్నీ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. నవదీప్ , సుమంత్ అక్కినేని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది తాజా సమాచారం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా .. గ్రామీణ యువకుడిగా రెండు విభిన్నమైన పాత్రలను ఆయన పోషిస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర సరసన సహ ఉద్యోగినిగా పూజా హెగ్డే కనిపిస్తుందని అంటున్నారు.

ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. టబు కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, నివేదా పేతురాజ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాను 2020సంక్రాంతికి విడుదల చేయనున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో భారీ అంచానాలు ఉన్నాయి.