సుకుమార్‌తో అల్లు అర్జున్‌ 21…!

557
sukumar allu arjun
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈమూవీలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా…నివేధా పేతురాజ్ ప్రత్యేక పాత్రలో నటించనుంది.

ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు బన్నీ. ఆర్య మూవీతో తనకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్‌తో సినిమాకు బన్నీ కమిట్ అయ్యాడు.సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్‌ నచ్చడంతో బన్నీ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.

అల్లు అర్జున్ 21వ సినిమాగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుండగా గీతా గోవిందం ఫేమ్‌ రష్మిక హీరోయిన్‌గా నటించనుంది. త్వరలో సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుండగా అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

- Advertisement -