ప్రేమకథ కావాలంటున్న బన్నీ

222
Allu-Arjun-and-Sukumar-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల గ్యాప్ తర్వాత వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మొదటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాకు అల… వైకుంఠపురంలో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈసినిమాకు సంబంధించిన టీజర్ ను ఇటివలే విడుదల చేశారు చిత్రయూనిట్.

ala-vaikunthapuramlo-

ఈమూవీని 2020సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈసినిమా తర్వాత బన్నీ మరో రెండు సినిమాలు చేయనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..దాంతో పాటు లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నాడు. అయితే మొదటగా వేణు శ్రీ రామ్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

 జనవరి నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అయితే సుకుమార్ తెర‌కెక్కించే ప్రాజెక్ట్ శేషచలం అటవీ నేపథ్యంలో గంధపు అక్రమ రవాణా గురించి ఉంటుంద‌ట‌..కానీ బన్నీ లవ్ స్టోరీ సిద్దం చేయమని చెప్పాడట. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ ఈచిత్ర నిర్మించగా రష్మీక మందన హీరోయిన్ గా నటించనుంది. వీరిద్దిరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమా రాగా ఇప్పుడు ఇది మూడవ సినిమా కావడం విశేషం.  అల్లు అర్జున్ కోసం సుకుమార్ కథను మారుస్తాడో లేదో చూడాలి మరి.