చిరంజీవి కొరటాల మూవీలో అల్లు అర్జున్!

491
chiranjeevi_allu-arjun
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈమూవీ షూటింగ్ జరుగుతుంది. ఈసినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఈమూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ పాత్ర 40నిముషాలు ఉండబోతున్నట్లు తెలిసింది.

తాజాగా ఉన్న సమాచారం మేరకు రామ్ చరణ్ ఈమూవీలో నటించడం లేదని తెలుస్తుంది. రాజమౌళి సినిమా షరతుల ప్రకారం, ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తయ్యేవరకూ చరణ్ మరో ప్రాజెక్టును అంగీకరించకూడదు. అంతేకాకుండా వేరే సినిమా చేసినా ఆర్ఆర్ఆర్ కంటే ఆ సినిమా ముందు విడుదల కాకూడదు. అందువల్లనే కొరటాల సినిమాలో చరణ్ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. అయితే చరణ్ స్ధానంలో అల్లు అర్జున్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ పాత్రలో చెయ్యడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

- Advertisement -