అశ్విన్ మీద అసూయ పుడుతుంది -రాజమౌళి

270
- Advertisement -

మహానటి ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, వంశి పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, పరుచూరి గోపాల కృష్ణ, జెమినీ కిరణ్, కె.ఎస్.రామారావు, రమేష్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్ రావు, డా. గోపిచంద్, నందిని రెడ్డి, సంపత్ నంది, త్రినాధ్ రావు నక్కిన, విజయ్ కుమార్ కొండా, కరుణాకరన్, బి.వి.ఎస్.యన్ ప్రసాద్ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మహానటి దర్శకులు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ లపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ మరియు ముఖ్య పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు.

Allu Aravind felicitation to Mahanati Team

రాజమౌళి మాట్లాడుతూ, “సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తాయి.. కానీ ఇండస్ట్రీ స్థాయిని పెంచే సక్సెస్ లు అరుదుగా వస్తుంటాయి. మహానటి ఈ కోవకు చెందిందే. ఈ చిత్రం పై ముందు నాకు అంచనాలు లేవు.. చూసాక ప్రతి అంశం.. రాసిన విధానం గాని.. ఆర్టిస్టులతో చేయించుకోవడం.. అన్నీ ఫెంటాస్టిక్.. హోల్ క్రెడిట్ గోస్ టు నాగ అశ్విన్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్స్ ప్రియాంక, స్వప్న. చిత్రంలో ఎన్నో అద్భుత సన్నివేశాలున్నాయి.. సావిత్రి జెమినీ గణేశన్ ప్రేమకథను దేవదాసుతో ముడి పెట్టడం, సావిత్రికి మందు అలవాటు చేసే సన్నివేశం వంటివి చాలా పొయెటిక్ గా, సటిల్ గా హేండిల్ చేశాడు అశ్విన్. హ్యాట్స్ ఆఫ్ టు హిం. నాకు అరుదుగా దర్శకుల మీద అసూయ పుడుతుంది. ఇప్పుడు అశ్విన్ మీద అదే ఫీలింగ్ కలుగుతుంది.”

అల్లు అరవింద్ మాట్లాడుతూ,” మహానటి సావిత్రిని తెర మీద ఇంత అద్భుతంగా చూపించి తెలుగు ప్రేక్షకులను పులకరింపచేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతి మరింత పెంచిన దర్శకుడిని, నిర్మాతలను అభినందించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. కీర్తి సురేష్ మహానటి సావిత్రిగారి లా అద్భుతంగా చేసింది. నిన్నటికి నిన్న బాహుబలి వంటి చరిత్రాత్మక చిత్రంతో తెలుగు సినిమా అంటే ఇదిరా అని రొమ్ము విరుచుకుని చెప్పుకున్నాం.. అది ఇంకా మర్చిపోలేదు.. ఇంత లోపే ఒక డిఫరెంట్ జానర్ తో మహానటి మళ్ళీ అంతే ఫీలింగ్ ఇచ్చింది. నా పేరు సూర్య కు పోటీ గా ఉన్నాయి కలెక్షన్స్ అనుకుంటుంటే, మహానటి తెలుగు సినిమా విజయం మనం సెలెబ్రేట్ చేసుకోవాలి డాడీ అని బన్నీ అన్నాడు. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ప్రేక్షకుడు మహానటి ని తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఒక సినిమా మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో ఇది ఉదాహరణ. తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా ఇది.”

Allu Aravind felicitation to Mahanati Team

అల్లు అర్జున్ మాట్లడుతూ,” ఈ సినిమా చూసాక.. అశ్విన్ కి కాల్ చేసి.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. వంటి పిచ్చి పదాలు వాడకుండా.. అశ్విన్ థ్యాంక్యూ ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్ అని చెప్పాను.. సినిమా చూసాక అన్ ఈజీగా, రెస్ట్ లెస్ గా ఫీల్ అయ్యాను.. జెట్ ల్యాగ్ లేకుండా.. జెట్ ల్యాగ్ పిల్ వేసుకుని పడుకున్నా.. అంత ఇన్ఫ్లూయెన్స్ చేసింది నన్ను మహానటి. మంచి స్క్రిప్ట్ ఉంటె ఐస్కాంతంలా మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు వచ్చి అత్తుకుంటారు అని ప్రూవ్ చేసింది ఈ సినిమా. స్వప్న, ప్రియాంక, అశ్విని దత్ మీరు తప్ప ఇంకెవరు ఈ సినిమా తీయలేరు. లెక్క పెట్టి తీస్తే లెక్కన్తే వస్తుంది.. లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది. ఈ సినిమా ఎంత చేసింది అనేది కాదు.. సినిమా ఇస్ నాట్ ఎ నెంబర్ ఇట్స్ ఎ ఎక్స్పీరియన్స్. మహానటి ఇస్ ప్రైస్ లెస్. థ్యాంక్యు అశ్విని దత్‌కి సినిమా మీద ఉన్న ప్యాషన్ కి హ్యాట్స్ ఆఫ్. “

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ” అందరూ ఇంత ఇలా మెచ్చుకుంటుంటే ఈ సినిమా నేను చేసిందేనా అనిపిస్తుంది.. ఇట్స్ సంథింగ్ బియాండ్ ఐ ఫీల్. వి ఆర్ స్టాండింగ్ ఆన్ షోల్డర్స్ అఫ్ లెజెండ్స్ , నిజాయతి గా హానెస్ట్ గా వి టచ్డ్ ది హిస్టరీ అఫ్ తెలుగు సినిమా.. యన్.టి.ఆర్ గారు, ఏ.యన్.ఆర్ గారు, సావిత్రి గారు, కె.వి రెడ్డి గారు, ఎల్.వి ప్రసాద్ గారు వంటి లెజెండ్స్ ఉన్నారు అందుకే అందరూ ఇంత ఇలా రియాక్ట్ అవుతున్నారు… ఇది వారి విజయం… మేము జస్ట్ నిమ్మిత్తమాత్రులం. ఇది ఇండస్ట్రీ తరపున సావిత్రి గారికి ఇచ్చే నివాళి. సావిత్రి గారి లైఫ్ స్టోరీ డెసెర్వ్స్ టు బి ఏ సూపర్ హిట్. చాలా రెస్పాన్సిబిలిటీ, భయం తో చేసాము.. అన్నీ కలిసొచ్చాయి సావిత్రిగారి ఆత్మ మమ్మల్ని నడిపించిందేమో అనిపిస్తుంది.. మళ్ళీ ఇది రిపీట్ చేయగలమో లేదో తెలియదు.. వి ఆర్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ థిస్ జర్నీ. ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేస్తున్న అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు.”

Allu Aravind felicitation to Mahanati Team

హరీష్ శంకర్ మాట్లాడుతూ,” బన్నీ అర్జెంట్ గా మహానటి చూడు, క్లాసిక్ అని మెస్సేజ్ పెట్టాడు.. మీ సినిమా రిలీజ్ తో పాటు రిలీజ్ అయినా మహానటి కి ఇంత మంచి ఫంక్షన్ చేయడం బన్నీ పెద్ద మనసు కు నిదర్శనం. నాగ అశ్విన్ నన్ను దర్శకుడిగా గిల్టీ ఫీల్ అయ్యేటట్లు చేసాడు ఇంత గొప్ప సినిమా తీసి. ఇట్స్ ఏ ట్రూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సినిమాలో ఎన్నో సందర్భాల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి.. ఎక్సెలెన్స్ ఆఫ్ సినిమా అంటే ఇదేనేమో. “

రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ” మాతృదినోత్సవ సందర్భంగా అల్లు అరవింద్ గారు సావిత్రమ్మగారి చిత్రం ఈ ఫంక్షన్ చేయడం అభినందనీయం. సావిత్రి గారి బయోపిక్ అంటే విషాదాంతం..కమర్షియల్ గా ఎలా చూపిస్తాడు అనుకున్నాం.. జెమినీ గణేశన్ తో ఆమె విషాద ప్రేమ గాథని సమంత – విజయ్ దేవేరుకోండ ల సక్సెస్ఫుల్ ప్రేమ కథ తో ముడి పెట్టడం అద్భుతంమైన కమర్షియల్ పాయింట్ అది. అత్యద్భుతంగా స్క్రీన్ప్లే రాసాడు నాగ్ అశ్విన్. ఎప్పుడూ థియేటర్ చూడని అరవైఏళ్లు పై బడిన వాళ్ళు వచ్చి సినిమా చూస్తున్నారు. స్వప్న, ప్రియాంక మీరు సాధించిన విజయం ఎటువంటిదంటే.. మాయా బజార్ చూడలేదా.. శంకరాభరణం చూడలేదా.. బాహుబలి చూడలేదా.. మహానటి చూడలేదా అని అడిగేంత గొప్ప సినిమా తీసారమ్మ.”

దర్శకుడు మారుతి మాట్లాడుతూ,” మహానటి ఫస్ట్ హాఫ్ చూసాకే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. రెండు రోజులు ఏమి రాయలేక పోయాను.. ఆ ఫ్లేవర్ అలానే ఉండి పోయింది. ఇంతమంది దర్శకులను స్పందించే లా చేసి .. మరో దర్శకుడిని పొగిడేలా చేయడం అంటే అది మాములు సినిమా కాదు. దర్శకులకి ఇది ఒక లెస్సన్ లాంటి సినిమా. ఇలాంటి గ్రేట్ సినిమాని అందించినందుకు నాగ్ అశ్విన్ కి థ్యాంక్స్.”

Allu Aravind felicitation to Mahanati Team

వంశి పైడిపల్లి మాట్లాడుతూ,” అశ్విన్ మీరు సినిమా తీయలేదు.. తెలుగు సినిమాకి ఒక బుక్ ఇచ్చారు. మీరు సావిత్రిగారి సినిమా తీయాలనుకోలేదు.. సావిత్రి గారే మిమ్మల్ని తన సినిమా తీయమని ఎంచుకున్నారనుకుంటున్నాను. అమెరికాలో ఉండే మా అక్కగారి అయిదేళ్ల అబ్బాయి మహానటి సినిమాకి రాను అన్నాసరే తీసుకువెళ్లి చూపించారట.. చిత్రం చూసినప్పటినుండి వాడు యు ట్యూబ్ లో సావిత్రి గారి పాటలే చూస్తున్నాడట .. అంత ఇంపాక్ట్ చేసింది ఈ చిత్రం. “

కీరవాణి మాట్లాడుతూ,” మహానటి కి అందరూ డివోషన్ తో పని చేసారు అందుకే ఇంత ఘన విజయం సాధించింది. తను తీసే చిత్రం కమర్షియల్ సక్సెస్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా కథని నమ్ముకుని తీసేవాడే నిజమైన దర్శకుడు. చాలా హానెస్ట్ గా, సటిల్ గా తీసాడు నాగ్ అశ్విన్.”

చిత్రంలో విజయ్ ఆంటోనీ పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ,” మహానటి చూసి మమ్మి డ్యాడీ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఇండస్ట్రీ లో గౌరవించే వ్యక్తులు వచ్చి మా టీంకి కంగ్రాట్స్ తెలపడం.. ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాకు భాగం ఇచ్చినందుకు అశ్విన్, స్వప్న, ప్రియంకాలకు చాలా థ్యాంక్స్.”

అశ్విని దత్ మాట్లాడుతూ, “నా ప్రియా మిత్రుడు అల్లు అరవింద్, మా హీరో అల్లు అర్జున్, రాజమౌళి గారు ఇంత మంది దర్శకులు, నిర్మాతలు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి రావడం చాలా అదృష్టం. అరవింద్ గారికి కృతజ్ఞతలు. నాగ అశ్విన్ కథ చెప్పినప్పుడు ఎలా చేస్తాడో ఏమిటో అనుకున్నా. సావిత్రి గారే ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకొని వాళ్ళ చేత ఇలా పని చేయించుకున్నారన్నది వాస్తవం. రాజమౌళి గారు చెప్పినట్లు ఈ చిత్రంలో నా కాంట్రిబ్యూషన్ ఏమి లేదు.. క్రెడిట్ మొత్తం అశ్విన్, ప్రియాంక, స్వప్న వాళ్లదే.”

Allu Aravind felicitation to Mahanati Team

స్వప్న దత్ మాట్లాడుతూ, “అందరూ ఈ చిత్రం చాలా బాగుంది.. తప్పకుండ విజయవంతం కావాలి అని విష్ చేసారు.. అప్పుడనిపించింది.. మా ఏడేళ్ల వనవాసం అయిపోయిందని.. మా కృషి.. నూట యాభై మంది పని చేయడమే కాకుండా .. ఏదో ఒక సూపర్ పవర్ మాతో ఇది చేయిస్తుంది అనిపించింది.. ఇది మా డ్యాడీ కి మేము ఇచ్చే గిఫ్ట్.. ఇంక అందరమూ రిటైర్ అయిపోవచ్చు. థ్యాంక్స్ టు అల్లు అరవింద్ గారు అండ్ బన్నీ ఫర్ హోస్టింగ్ థిస్ పార్టీ.”

కీర్తి సురేష్ మాట్లాడుతూ,” ఇది సావిత్రిగారి విజయం. నాగ్ అశ్విన్ కి చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రియాంక, స్వప్న లు లేక పోతే ఈ చిత్రం సాధ్యం కాదు. ఈ చిత్రం లో అన్ని విభాగాల్లో చాలా మంది లేడీ టెక్నీషియన్స్ పని చేసారు. మమ్మల్ని సత్కరిస్తునందుకు అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ గారికి చాలా థ్యాంక్స్. రాజేంద్ర ప్రసాద్ గారు.. మా పెదనాన్నగారికి థ్యాంక్స్. దుల్కర్, సమంత లు, మోహన్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంకు సావిత్రమ్మ ఫర్ థిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ యామ్ బ్లెస్డ్.”

- Advertisement -