బోయపాటితో గీతా ఆర్ట్స్ మూవీ..

180
allu aravind boyapati

ఒకరేమో మాస్ చిత్రాల దర్శకుడు మరొకరేమో భారీ బడ్జెట్ మూవీలకు కేరాఫ్..వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తే సినీ ప్రేక్షకులకు పండగే. ఇంతకి వారెవరనుకుంటున్నారా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్,గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.

కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ ఈ మేరకు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. త్వరలో మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ప్రకటించారు. అయితే హీరో ఎవరనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

గతంలో బోయపాటి..అల్లు అర్జున్,రాంచరణ్‌లో సినిమాలను తెరకెక్కించారు. సరైనోడు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించగా వినయ విధేయ రామ బాక్సాపీస్ వద్ద బోళ్తాపడింది. అయితే తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి తెరకెక్కించే మూవీలో మెగా హీరో ఉంటాడా లేదా వేరే వారితో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.