సాహో..ఫీవర్ మొదలైంది

383
prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 350 కోట్లతో నాలుగు భాషల్లో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆగస్టు 18న రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఫీవర్‌ అప్పుడే మొదలైపోయింది. చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకను ఇప్పటివరకు చేయని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. దీంతో సాహో ఈవెంట్‌ పాస్‌ల కోసం ప్రభాస్ ఇల్లు,ఆఫీస్‌కి భారీగా ఫ్యాన్స్ చేరుతున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అందుకు తగ్గట్టే ఏర్పాటుచేశారు.

శ్ర‌ద్ధా క‌పూర్ ఈ సినిమాలో హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది పండ‌గ లాంటి సినిమా అని మాటిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.