ఆలీ..పండుగాడి ఫోటో స్టూడియో టీజర్

147
ali pandugadu

ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్ పైగుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా “పండు గాడి ఫోటో స్టూడియో”.ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్ర టీజర్ ను సుకుమార్ ఇటీవల హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో ఆలీ, నిర్మాత గుదిబండి వెంకట సాంబి రెడ్డి, దర్శకుడు దిలీప్ రాజా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ”నేను ఆలీ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన చేసే కామెడి ని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ఆలీ గారు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.ఒక స్టార్ హీరోలా ఆలీ గారిని దర్శకుడు ఈ చిత్రం లో చూపించారు. రెండు సవంత్సరాలు కథ తయారు చేసుకుని ,అనంతరం దర్శకుడు దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చారు. అలాగే నిర్మాత సాంబిరెడ్డి గారికి 22 విద్యాలయాలు వున్నాయి. చక్కటి అభిరుచి తో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు చాలా బాగున్నాయి. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందరిని అలరించనుంది.” అని అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ” మా చిత్ర టీజర్ ని విడుదల చేసిన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు జంధ్యాల గారిఫోటోకి నమస్కరించి ఈ సినిమా ప్రారంభించాం. ఈ చిత్రంలో మా హీరో ఆలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి అయ్యి పోతుంది. ఈ చిత్రంలో పాత్రలు విలక్షణంగాను, నటీనటుల పేర్లు వైవిధ్యంగాను ఉంటాయి.ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఆలాగే నూతన నటుడు సందీప్ రాజా, టీనా చౌదరి ఈ చిత్రం లో విలక్షణ పాత్రలు పోషించారు..అలాగే సంగీత దర్శకుడు యాజమాన్య సారథ్యంలో శ్రేయగోషల్,మనీషా చక్కని పాటలు పాడారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్ర ఫ్రీ రిలీజ్ వేడుకను తెనాలి లో ఈనెల 21 న నిర్వహించనున్నాం “అని అన్నారు.

ఆలీ, రిషిత వినోదకుమార్, బాబుమోహన్, సుధ ,జీవ , శ్రీలక్ష్మీ రాంజగన్ ,చిత్రం శ్రీను, జబర్దస్త్ రాము తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి,సహా నిర్మాతలు:ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం:యాజమాన్య , ఎడిటర్:నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్:షా వాలిన్, మల్లేష్, డాన్స్:రఘు మాస్టర్, అజయ్ శివశంకర్, అమ్మ సుదీర్, కధ, మాటలు , స్క్రీన్ ప్లే,దర్శకత్వం:దిలీప్ రాజా