బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన అల..వైకుంఠపురంలో

457
ala vaikuntapuramlo
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా విడుదలైంది. ఈమూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించారు. ఈమూవీ బాక్సా ఫిస్ దగ్గర అదరగొడుతోంది. మొదటి షో నుంచే పాజిటావ్ టాక్ రావడంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగిపోయారు. ఈమూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీల్ లో కూడా హంగామా సృష్టిస్తుంది. అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌తో రచ్చ చేస్తోంది. ఆ రెండు దేశాల్లో ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి.

ముఖ్యంగా న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌ను రాబడుతోంది. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ప్రీమియర్ షోలకు న్యూజిలాండ్ లో 21,290డాలర్లు మాత్రమే వసూళ్లు చేసింది. మరోవైపు ఒకరోజు ముందే విడుదలైన సరిలేరు నీకెవ్వరు అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ ని అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఓవర్సీస్ లో అంతపెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. మరోవైపు తొలి రోజు కలెక్షన్లలో సరిలేరు నీకెవ్వరు సినిమాను బీట్ చేసింది అల..వైకుంఠపురంలో మూవీ. సరిలేరు నీకెవ్వరు సినిమాకు తొలి రోజు రూ.36కోట్లు రాగా..అల..వైకుంఠపురంలో సినిమాకు రూ.46కోట్లు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు..

- Advertisement -