‘అల వైకుంఠపురములో’ 10 డేస్‌ కల్లెక్షన్స్..

422
allu arjun
- Advertisement -

స్టైలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్‌ చేస్తూ.. భారీ కల్లెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలోని పాటల విషయానికొస్తే సినిమా రిలీజ్‌ కాకముందే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ALVP

అల్లు అర్జున్‌ కెరియర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు నాన్ బాహుబలి సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా మొదటి షో నుండి సూపర్‌ హిట్ టాక్‌తో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది.

‘అల వైకుంఠపురములో’ వసూళ్ల వివరాలు (కోట్లలో).. నైజాం- 35.69,సీడెడ్- 18.07,వైజాగ్- 18.80,గుంటూరు- 9.93,తూర్పుగోదావరి- 9.89,పశ్చిమగోదావరి- 7.65,కృష్ణా- 8.80,నెల్లూరు- 4.07,మొత్తం తెలుగు రాష్ట్రాలు -112.90,కర్ణాటక – 10.70,తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి – 3.60,అమెరికా – 12.50, ఇతర దేశాలు – 3.55,మొత్తం షేర్ – 143.25. ఈ చిత్రం 10 రోజుల్లో ఏకంగా రూ. 220 కోట్ల గ్రాస్, రూ. 143 కోట్ల షేర్ ను సాధించింది.

- Advertisement -