అల..వైకుంఠపురంలో శాంపిల్ అదిరింది..!

1130
ala vaikuntapuramlo
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురములో. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా అప్పుడే మూవీ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ,టీజర్ రాగా తాజాగా తమన్ కంపోజ్ చేసిన అద్భుతమైన మెలోడీలోని ఒక రెండు లైన్స్‌ని శాంపిల్‌గా వదిలారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటలోని మీనింగ్ ఫుల్ లిరిక్స్‌కి అంతా ఫిదా అయ్యారు.

సామజవరగనమన అనేది ఈపాట హుక్ లైన్ కమ్ టైటిల్. కానీ ఆ రెండు లేకుండానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత ఫ్రెష్‌గా ఉంది ఈ మెలోడీ. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫుల్ ప్లెడ్జెడ్‌గా కామెడీని పండించనున్నారు.

- Advertisement -