అల వైకుంఠపురంలో…రాములో రాములా..!

353
allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో అల..వైకుంఠపురంలో అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను అల్లు అరవింద్, కె.రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. అల వైకుంఠపురంలో దీపావళి ట్రీట్ ఇవ్వనుంది. ఇప్పటికే సామజవరగమన అంటూ మ్యూజిక్ లవర్స్‌ని మైమరిపించిన తమన్ తాజాగా రాములో రాములా అంటూ సెకండ్ సింగిల్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు సెకండ్ సాంగ్ ప్రొమో విడుదల కానుండగా దీపావళికి ఫుల్ సాంగ్‌ని విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన సామజవరగమన పాట యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు 40 మిలియన్‌ వ్యూస్‌ సాధించి సత్తాచాటింది. 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.