బన్నీ….దీపావళి ట్రీట్..!

340
ala vaikuntapuramlo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-స్టైలీష్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సామజవరగమన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు 30 మిలియన్ వ్యూస్‌ రాబట్టి సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా దీపావళికి మరో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు బన్నీ.

దీపావళిని పురష్కరించుకుని అక్టోబర్ 27న ‘అల… వైకుంఠపురములో…’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారని టాక్‌. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యంమూర్తి’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఈ ఇద్దరు స్టార్లు చూస్తున్నారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.