అల..వైకుంఠపురంలో విడుదల తేదీ ఖరారు..

673
Ala Vaikuntapuramlo
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హరిక అండ్ హాసిని బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమాని సంక్రాంత్రి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో బన్ని ఓ చేతిలో కోడి పుంజును, మరో చేతిలో కొడవలి పట్టుకొని పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నాడు. చాలాకాలం తర్వాత బన్నీ సినిమా విడుదల కానుండడంతో బన్నీ అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ సినిమాలో హీరో సుశాంత్, టబూ, నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సునీల్, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమానుంచి విడుదలైన సామజవరగమన సాంగ్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఈమూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -