వైజాగ్ లో బన్ని అభిమానుల భారీ బైక్ ర్యాలీ

188
Allu Arjun in Vizag

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈచిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతోంది.

ఈసందర్భంగా ఈమూవీ విజయోత్సవ వేడుకను వైజాగ్ ఇవాళ నిర్వహించారు. వైజాగ్ కు చేరుకున్న ఈ చిత్రయూనిట్ అక్కడి మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలసంఖ్యలో మోటార్ సైకిళ్లతో అభిమానులు బన్నీ వాహనాన్ని వెన్నంటి వచ్చారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన హమ్మర్ వాహనంపైకి ఎక్కి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. బన్ని రాకతో వైజాగ్ లో ట్రాఫిక్ జామ్ అయింది.