బన్నీ త్రివిక్రమ్ మూవీలో ఇద్దరు యంగ్ హీరోలు

271
Allu Arjun New Movie
- Advertisement -

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈమూవీ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లో జరుపుకుంది. ఈచిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, మరియు గీతా ఆర్ట్స్ సంస్ధ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కు ఇది 19వ సినిమా కాగా..త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ చిత్రం. తమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా పూజా హెగ్డెను తీసుకున్నారు.

ఈ సినిమాలో, ‘టబు’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈనెల 24నుంచి ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారాం ఇద్దరు యువ హీరోలు ఈమూవీ కిలక పాత్రలో నటించనున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున అల్లుడు సుశాంత్ కాగా మరోకరు నవదీప్. హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుశాంత్ కి హిట్ పడలేదు.

ఇక నవదీప్ కి కెరియర్ ఆరంభంలో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినా, ఆ తరువాత ఆయనకి అవకాశాలే లేకుండాపోయాయి. ఈసినిమాతో వీరిద్దరూ తన అదృష్టాన్ని పరిక్షించుకొనున్నారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈమూవీని దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్.

- Advertisement -