సమంతకు బాలీవుడ్ ఆఫర్..

548
Samantha
- Advertisement -

అక్కినేని సమంత పెళ్లైన తర్వాత గ్లామర్ పాత్రలు కాకుండా వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటుంది.ఇటివలే ఆమె నటించిన సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబి సినిమాలో సమంత ముఖ్య పాత్రలో నటించింది.     సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ఈమూవీ మంచి విజయాన్ని సాధించింది.

కాగా సమంత నటించిన యూ టర్న్ మూవీ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.  యూ టర్న్ మూవీ  తెలుగు, తమిళ్ లో హిట్ అందుకుంది. ఈ మూవీని బాలీవుడ్ లో  తెరకెక్కించనున్న నేపథ్యంలో సమంతను  సంప్రదించారట బాలీవుడ్ దర్శక నిర్మాతలు.  అయితే ఈ ఆఫర్ ను వెంటనే తిరస్కరించిందట సామ్.

Samantha

 సమంత నో చెప్పడంతో తాప్సి ని ఎంచుకున్నారు చిత్ర యూనిట్. ఇండియా మహిళా క్రికెట్ కెప్టెన్ మిధాలి రాజ్ బయోపిక్ లో నటిస్తుంది. ఇటివలే ఈమూవీ షూటింగ్ లో జాయిన్ అయింది తాప్సి.. ఇక సమంత శర్వానంద్ సరసన 96మూవీ రీమేక్ లో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.

- Advertisement -