బిగ్ బాస్ 3 నుంచి నాగార్జున అవుట్..

451
Bigboss Nagarjuna
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 విజయవంతంగా 6వ వారం కొనసాగుతుంది. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ రియాలిటీ షోకి బుల్లితెర ప్రేక్షకుల మంచి రెస్పోన్స్ వ‌స్తోంది. గత రెండు సీజన్ల కంటే మూడవ సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు రేటింగ్స్ లో కూడా స్టార్ మా టాప్ ప్లేస్ లో ఉంది. అయితే బిగ్ బాస్ 2లాగే ఈసిజన్ లో కూడా లీక్ లు వెటాడుతున్నాయి. షో లో ఎం జరిగిందో ముందే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్నాయి. ఈ లీకులను కట్టడి చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నా అవి అగడం లేదు.

BiggBossTeluguNagarjuna

తాజాగా బిగ్ బాస్ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా నాగార్జున ఈ షో నుంచి తప్పకున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అసలు విషయం ఎంటంటే నాగార్జున తప్పుకుంది షో మొత్తం నుంచి కాదట కేవలం ఈ శని, ఆదివారం మాత్రమే నాగార్జున కనిపించడట. వచ్చే వారం నుంచి నాగార్జున తిరిగి బిగ్ బాస్ లో పాల్గోంటాడని సమాచారం. ఇందుకు కారణం ఎంటంటే నాగార్జున పుట్టిన రోజు ఉండటంతో తను ఫ్యామిలీతో ఫారిన్ కు వెళ్లాడట.

ఈ కారణంతోనే ఈవీక్ నాగార్జున్ బిగ్ బాస్ కు దూరంగా ఉండనున్నాడు. ఇక పోతే ఈవారం బిగ్ బాస్ హోస్ట్ గా గత సీజన్ లో హోస్ట్ గా చేసిన నాని లేదా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరు హోస్ట్ చేయనున్నారు. మ‌రి వీరిద్ద‌రిలో ఈ వీకెండ్‌కి హోస్ట్‌గా ఎవ‌రు వ‌స్తారో మాత్రం క్లారిటీ లేదు. ఈవాళ ప్రసారమయ్యే ఎపిసోడ్ చూస్తే గాని ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు.

- Advertisement -