ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను..మన్మధుడు2 ట్రైలర్(వీడియో)

260
Manmadhudu2 Trailer
- Advertisement -

అక్కినేని నాగార్జున దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మన్మధుడు2. మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈమూవీలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా..సమంత, కీర్తి సురేష్ లు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈసినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆగస్ట్ 9న ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఈ వయసులోను రొమాంటిక్ హీరోగా రంగంలోకి దిగిన నాగ్, అభిమానులను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

- Advertisement -